భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై విదేశాల్లో కూడా
భారతీయ వైద్య విద్యార్థులు ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి జాతీయ వైద్యమండలి వచ్చే 10 ఏళ్ల కాలానికి గుర్తింపు లభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత్లో వైద్య విద్య అభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చని వెల్లడించింది. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న, రాబోయే పదేళ్లలో ఏర్పాటయ్యే వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు పొందుతాయని కేంద్ర వైద్య, ఆరోగ్యవాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 706 వైద్య కళాశాలలు ఉన్న విషయం తెలిసిందే.













