జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు
యూఏఈలో ఓ భారతీయుడిని అదృష్టం వరించింది. పంజాబ్‌కు చెందిన గుర్ప్రీత్ సింగ్ (35) లాటరీలో ఏకంగా రూ.19.90 కోట్లు గెలుచుకున్నారు. భారత్ నుంచి వచ్చి లాటరీతో సంపన్నులైన అదృష్టవంతుల జాబితాలో తాజాగా ఆయన చేశారు. షార్జాలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన 067757 నంబరుతో ఉన్న లాటరీ టికెట్‌ను ఆగస్టు 12న కొనుగోలు చేసినట్లు అక్కడి ఓ వార్త సంస్థ తెలిపింది. తన లాటరీ టికెట్‌కు బహుమతి లభించిందని నిర్వాహకులు ఆయనకు ఫోన్ చేశారు. నేను పనిలో ఉండగా ఎవరో ఫోన్ చేసి నాకు లాటరీలో రూ.19.90 కోట్ల బహుమతి లభించిందని చెప్పడంతో ముందుగా ఆశ్చర్యపోయాను. లాటరీలో వచ్చిన సొమ్ముతో యూఏఈలో ఇల్లు కొంటాను అని గుర్ప్రీత్ అన్నారు.













