భారత్, చైనా జవాన్ల మధ్య మళ్లీ ఘర్షణలు
భారత్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ వైపు తూర్పు లద్దాఖ్ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే ఈ వివాదం తలెత్తింది. సిక్కింలోని నాకులా సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్లు ఘర్షణకు దిగారు. నకులా ప్రాంతం ద్వారా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలను భారత బలగాలు దీటుగా అడ్డుకున్నాయి. ఈ అడ్డుకునే క్రమంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. అయితే ఈ ఘర్షణ వారం క్రితమే జరిగినట్లు సమాచారం. తాజాగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణల్లో 20 మంది చైనా సైనికులు తీవ్రంగా గాయపడగా, నలుగురు భారత సైనికులకు గాయాలయ్యాయి.
సుదీర్ఘంగా ఇరు దేశాల మధ్య చర్చలు
తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనపై రెండు నెలల తర్వాత ఇరు దేశాల మధ్య ఆదివారం చర్చలు జరిగాయి. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన చర్చలు… అర్ధరాత్రి వరకూ చర్చలు జరిగాయి. అయితే బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం.













