దుబాయ్లో భారతీయ బాలుడి ప్రతిభ!
డ్రిల్లింగ్ చేయకుండా మేకులు కొట్టకుండా గోడకు హోమ్ థియేటర్ను బిగించడం సాధ్యమేనని దుబాయ్లో నివసిస్తున్న భారతీయ బాలుడు ఇషిర్ వాధ్వా(16) రుజువు చేశారు. జెమ్స్ వరల్డ్ అకాడమీలో 10వ తరగతి చదువుతున్న ఇషిర్.. స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మేకులు, డ్రిల్లింగ్ లేకుండానే గోడలకు భారీ వస్తువులను బిగించడం ఎలా? అనే అంశంపై తండ్రి, సోదరుడి సాయంతో పరిశోధించి క్లాపిట్ అనే పరికరాన్ని తయారు చేశారు. గోడకు ఒక స్టీల్టేప్, గోడకు తగిలించాలనుకున్న వస్తువుకు, మరో స్టీల్టేప్ను అతికిస్తారు. ఆ రెండింటినీ నియోడైమియమ్ అనే అయస్కాంతంలో జోడిస్తారు. ఇషిర్ తండ్రి సుమేశ్ వాద్వా, క్లాపిట్ ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు.













