ఇతర దేశాల కన్నా.. భారత్ కు అధికంగా

అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ దేశాలకు ఉచితంగా పంపిణీ చేయనున్న కోవిడ్ టీకా డోస్‍లలో భారత్‍కే అధిక పరిమాణంలో టీకాలు దక్కుతాయని అమెరికాలోని భారత రాయబారి తరన్‍జిత్ సింగ్ సంధూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను విరివిగా పంపిణీ చేయాలని అమెరికా నిర్ణయించిందనే విషయాన్ని సంధూ గుర్తు చేశారు. అవసరానికి మించి ఉన్న టీకాలను ఇండియా లాంటి దేశాలకు అందజేయాలంటూ జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో అగ్రరాజ్యం తాజాగా విడుదల చేసిన పొరుగు, మిత్రదేశాల జాబితాలో భారత్ ఉందన్నారు.