బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారత రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం ఉదయం క్షిపణి ఈ పరీక్షను పూర్తి చేసుకుంది. దీనికి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేధించే సామర్థ్యం ఉంది. ఈ సూపర్సోనిక్ క్షిపణులను భూమి, సముద్రంతో పాటు పైటర్ జెట్ల నుంచి ప్రయోగించవచ్చని డీఆర్డీవో అధికారి తెలిపారు. దీన్ని రష్యాకు చెందిన ఏరోస్పెస్ ఏజెన్సీతో కలిసి డీఆర్డీవో రూపొందించింది. అధునాతన బ్రహ్మోస్ క్షిపణిని 2017లోనే రక్షణశాఖ పరీక్షించి విజయం సాధించింది.













