విదేశాల నుంచి భారత్ కు వచ్చిన వారికి జీనోమ్ టెస్ట్
భారత్‌లో కరోనా కొత్త రకం కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే డిసెంబర్ 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వారందరికీ జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించనుంది. కొత్త రకం వైరస్‌లను నిర్ధారించడంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
విదేశాల నుంచి వచ్చిన ఆరుగురిలో కరోనా కొత్త రకం వైరస్ బయటపడింది. కరోనాతో పోలిస్తే యూకే స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో యూకే స్ట్రెయిన్ సహా కొత్తరకం వైరస్‌లను గుర్తించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 9 నుంచి 22 మధ్య భారత్‌కు వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారందరికీ జీనోమ్ పరీక్షలు చేయనున్నాం. ఇందుకోసం 10 ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్ రాకముందే 5వేల జీనోమ్ పరీక్షలు చేశాం. ఈ సంఖ్యను క్రమంగా పెంచుతాం అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.













