ప్రధాని మోదీ చరిత్రాత్మక ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారు. భారత తొలి మానవ సహిత రోదసీ యాత్ర గగన్యాన్ కోసం ప్రస్తుతం ముమ్మరంగా శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. తిరువనంతపురం సమీపంలోని తుంబాలో విక్రమ్ సారాభాయ్ రోదసి కేంద్రం (విఎస్ఎస్సి)లో సభికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ప్రతిష్ఠాత్మక వ్వోమగాములు గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత బాలకృష్ణన్ నాయక్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాలను జాతికి పరిచయం చేశారు. ప్రధాని మోదీ వారికి ప్రతిష్ఠాత్మక వ్యోమగామి వింగ్స్ అందజేస్తూ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు శక్తులుగా ఆ వ్యోమగాములను శ్లాఘించారు. ఈ యాత్ర ప్రాముఖ్యాన్ని మోదీ ఉద్దాటిస్తూ నాలుగు దశాబ్దాల అనంతరం ఒక భారతీయ రోదసీలోకి ప్రవేశించబోతున్నట్లు తెలియజేశారు.













