పాకిస్థాన్ కు భారత్ విజ్ఞప్తి
శ్రీనగర్, షార్జా విమాన సర్వీసులను తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని పాకిస్థాన్‌కు భారత్ కోరింది. కశ్మీర్ సామాన్య ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాన్ని పున పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌తో దౌత్యమార్గాల ద్వారా చర్యకు తీసుకు వచ్చాం. ఈ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్న సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించాం అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విమాన సేవలకు పాక్ అనుమతి నిరాకరించింది. దీంతో విమానం చుట్టూ తిరిగి గుజరాత్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది.
శ్రీనగర్, షార్జా విమానసేవలను కేంద్ర హోమంత్రి అక్టోబర్ 23న ప్రారంభించారు. తొలి వారం రోజులు ఎలాంటి అంతరాయం కలగలేదు. అయితే అక్టోబరు 31 నుంచి నవంబరు 30 వరకు అనుమతులను పాక్ నిలిపివేసింది.













