రెండో దశలో 16 లక్షల మందికి పైగా…

దేశంలో రెండోదశ కరోనా వైరస్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు 16 లక్షలమందికి పైగా మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక కథనం రాసింది. భారత ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారం కరోనా రెండు దశల్లో కలిపి మొత్తం 3,11,388 మంది మరణించారు. ప్రభుత్వం చూపే అంకెల కన్నా వాస్తవంగా చోటు చేసుకున్న మరణాల సంఖ్య దాదాపు అయిదురెట్లు అధికం. నిపుణులతో సంప్రదింపులు, కొన్ని నెలల నుంచి కేసులు, మరణాల సంఖ్యను విశ్లేషించిన మీదటే తాము ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా మూడు యాంటీ బాడీ పరీక్షల సమాచారాన్ని కూడా విశ్లేషించామని అది పేర్కొంది.