2027 కాదు..2023 లోనే భారత్ ఆ రికార్డు!

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ త్వరలోనే అవతరించనున్నదని చైనా జనగణనవేత్తలు అంచనా వేస్తున్నారు. 2027 నాటికి భారత్ చైనాను అధిగమించి ఆత్యధిక జనాభా గల దేశంగా మారుతుందని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. ఆ అంచనాల కంటే ముందే అంటే 2023 చివరినాటికి భారత్ ఈ రికార్డు సాధించవచ్చునని చైనీయులు అంటున్నారు.