ప్రపంచంలోనే అత్యధికం.. దేశంలో 97 కోట్ల మందికి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్తగా దాదాపు రెండు కోట్ల మంది యువ ఓటర్లను జాతితాలో చేర్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఇప్పుడు ఆరు శాతం అధికంగా ఓటర్లు నమోదైనట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు అంటే 96.88 కోట్ల మంది రానున్న సాధరాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు అని ఈసీ ప్రకటించింది.
88.35 లక్షల మంది దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ రోజున సహకారం అందించనున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో మొత్తం మీద 96,88,21,926 కోట్ల మంది అర్హత కలిగిన ఓటర్లు ఉండగా, వీరిలో 49.72 కోట్ల మంది పురుషులు, 47.15 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2024 నాటికి లింగ నిష్పత్తి 948కి పెరిగింది. ఓటర్ల జాబితా వెల్లడిలో పారదర్శకతపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు పుణెలో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.













