అంతర్జాతీయ విమానాలపై ..డీజీసీఏ మరో కీలక నిర్ణయం
అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డీజీసీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ విమానాల నిలిపివేతను పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసుల సస్పెన్షన్ను అక్టోబర్ 31, 2021 వరకు మరింత కాలం పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అయితే కేస్ టు కేస్ ప్రతిపాదిన ద్వారా ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయంగా షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చని పేర్కొంది. ఇంతకు ముందు ఇటువంటి విమానాలను సెప్టెంబర్ 30 వరకు నిలిపివేశారు.













