నేటినుంచి అమెరికాకు విమానాలు
లాక్డౌన్ కారణంగా గత మార్చి నెలలో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను పున ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా, ఫ్రాన్స్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నట్టు పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఢిల్లీకి 17వ తేదీ నుంచి 31 వరకు 18 విమానాలు నడుస్తాయని వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరుకు, ఫ్రాన్స్ నుంచి ఈ నెల 18 నుంచి ఆగస్టు 1 వరకు 28 విమాన సర్వీసులు నడుస్తాయని వివరించారు. జర్మనీ, బ్రిటన్‌తో కూడా అంతర్జాతీయ విమానసర్వీసులు నడిపేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఢిల్లీ, లండన్ మధ్య త్వరలోనే రోజూరెండు విమానాలు నడుస్తాయని చెప్పారు. చాలా దేశాల నుంచి విమాన సర్వీసుల పున ప్రారంభానికి వినతులు వస్తున్నాయని, కానీ కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని వివరించారు. దేశీయ విమానాల్లో టికెట్ల రేట్లపై ఉన్న నియంత్రణ ఆగస్టు 24 తర్వాత కూడా కొనసాగుతుందని పూరి వెల్లడించారు.













