దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరణంతో దేశం మొత్తం విషాదం అలుముకుంది. ఆయన అందించిన సేవలను స్మరించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఏడురోజులపాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది. మరోవైపు పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపైనా జాతీయజెండాను అవనతం చేశారు. ప్రణబ్‌కు అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికేందుకు రక్షణశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 10న అనారోగ్యంతో ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చేరిన ప్రణబ్‌ముఖర్జీకి వైద్యులు మొదడులో ఏర్పడిన కణితికి శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసింది. 21 రోజులుగా చికిత్స పొందుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.













