తాము అధికారంలోకి వస్తే…. ఆ స్టేడియంకు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మార్చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. ఆ స్టేడియంకు సర్దార్ పటేల్ పేరును పెట్టనున్నట్టు ఆ పార్టీ పేర్కొన్నది. 10 లక్షల మంది గుజరాతీలకు ఉద్యోగులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒంటరి మహిళకు నెలకూ రూ.2 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడువేల ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను రీఓపెన్ చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించనున్నట్టు మ్యానిఫెస్టోలో వెల్లడించారు. 3 లక్షల వరకు రైతు రుణాలను ఎత్తివేయనున్నారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయనున్నారు. నిరుద్యోగ యువతకు నెలా రూ.3 వేలు ఇవ్వన్నుట్లు మ్యానిఫెస్టోలో తెలిపారు.













