ఉద్యమ రైతులకు ..కేంద్ర ప్రభుత్వం మరో ఆఫర్
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా ఆందోళన సాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విమరించేలా కేంద్ర ప్రభుత్వం మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన పోలీసు కేసులను తక్షణమే ఎత్తేస్తామని తెలిపింది. ఈ మేరకు మరో ప్రతిపాదన పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. రైతు సంఘాలకు కేంద్రం కొన్ని ప్రతిపాదలు పంపింది. కనీస మద్దతు ధర (ఎంఎస్సీ) చట్టబద్ధతపై కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. రైతులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటామని, అయితే అంతకంటే ముందు అన్నదాతలు తమ ఉద్యమాన్ని విరమించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై సంయుక్త కిషాన్ మోర్చాకు యెందిన ఐదుగురు సభ్యుల కమిటీ నేడు సమావేశమైంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్లో కొన్ని లోపాలున్నాయని, ఆందోళన విరమించిన తర్వాత కేసులు వెనక్కి తీసుకుంటామని చెప్పడం ఆమోదయోగ్యం కాదని ఆ కమిటీ తీర్మానించింది. ప్రభుత్వ ప్రతిపాదలను వెనక్కి పంపింది. దీంతో కేంద్రం వాటిని సవరించి మళ్లీ కొత్త ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.













