అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. ఆయనే మా సీఎం
గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మెజార్టీ వస్తే, ఆయనే తమ ముఖ్యమంత్రి అంటూ పేరు వెల్లడించారు. అహ్మదాబాద్లో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీకి మెజార్టీ వస్తే భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారు అని వెల్లడించారు. గుజరాత్ ప్రధాని మోదీ, అమిత్ స్వరాష్ట్రం. రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ కమలం పార్టీ అధికారంలో ఉంది. వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో విస్తృతం ప్రచారం నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్రకు అనూహ్యంగా సీఎం పదవి దక్కింది. విజయ్ రూపానీ నుంచి ఆయన సీఎం కూర్చీని దక్కించుకున్నారు. ఘాట్లోడియా నుంచి పటేల్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అదేస్థానం నుంచి రెండోసారి టికెట్ దక్కించుకున్నారు.













