ముగిసిన భారత్, అమెరికా… నేవీ విన్యాసాలు

హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా నేవీ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ విన్యాసాల్లో పి-81, మిగ్ 29కే ఎయిర్‍క్రాఫ్ట్లతో పాటు ఇండియన్ నేవీ షిప్స్ కొచ్చి, టెగ్‍లు పాల్గొన్నాయి. అమెరికా షిప్స్, ఎయిర్‍క్రాఫ్ట్లతో కలిసి నేవీ అధికారులు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ క్రాస్ డెక్ హెలీకాప్టర్ ఆపరేషన్స్, యాంటీ సబ్‍మెరైన్ ప్రదర్శనలు చేశారు. మారిటైమ్ ఆపరేషన్స్లో భాగంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు, నావికా సామర్థ్యం, రక్షణ రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాల బలోపేతానికి ఈ విన్యాసాలు నిర్వహించారు.