భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం
భారత అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా తయారు చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్స్ ను భారత వైమానిక దశంలోకి ప్రవేశ పెట్టారు. రాజస్థాన్ జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో జరిగిన కార్యక్రమంలో హెలికాప్టర్లను వాయుసేనలోకి ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఎల్సీహెచ్ ఇండక్షన్కు నవరాత్రుల కంటే మెరుగైన సమయం, యోధుల భూమి రాజస్థాన్‌లో మరొకటి ఉండదన్నారు.













