నా మద్దతు ఎప్పుడైనా భారత్‌కే
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకునప్పటికీ తన మద్దతు ఎప్పుడూ భారత్‌కే ఉంటుందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి సృష్టం చేసింది. ఇదే విషయమై భర్త షోయబ్‌తో చాలాసార్లు సరదాగా వాదించేదాన్నని సానియా చెప్పుకొచ్చింది. డేటింగ్లో ఉన్నప్పటి నుంచి ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. ఎప్పుడైనా మా మధ్య ఆటలకు సంబంధించిన విషయం వస్తే నా మద్దతెప్పుడూ భారత్‌కే అని సృష్టం చేస్తుంటా. అయితే, షోయబ్ మాత్రం క్రికెట్లో భారత్‌పై అతనికున్న వ్యక్తిగత రికార్డులను ప్రస్తావిస్తాడు. భారత్‌పై నాకు మంచి రికార్డుంది తెలుసా అని సరదాగా అంటుంటాడు అని సానియా వెల్లడించించింది.













