కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజాద్
కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్‌కు షాక్ ఇచ్చారు. చాలా కాలం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానంపై అజాద్ గుర్రుగా ఉన్నారు. పార్టీ ట్రబుల్ షూటర్‌గా ఉన్న ఆయన పార్టీలో మార్పు కోసం పట్టుబట్టుతున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ఆజాద్‌కు కీలక బాధ్యతలను అప్పగించిన కొద్ది సేపటికే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్‌గా పార్టీ అధిష్టానం ఆయనను నియమించింది. అయితే గంటల వ్యవధిలోనే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. అంతే కాదు జమ్మూ కాశ్మీర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కూడా ఆజాద్ రాజీనామా చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. ఆలిండియా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడైన తనను జమ్మూ కాశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడం పట్ల ఆయన అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.













