వెంకయ్య నాయుడికి కంభంపాటి అభినందనలు
పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, టీడీపీ ఎంపీలు, పుణె ఎంఐటీ విద్యార్థులు అభినందనలు తెలిపారు. కంభంపాటి హరిబాబు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్లు వెంకయ్యకు శాలువా కప్పి సత్కరించారు. ఇది తెలుగువారికి గర్వకారణమన్నారు. పుణెలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో చదివే పీజీ విద్యార్థులతో వెంకయ్య నాయుడు ముచ్చటించారు. యువతరంతో ఆలోచనలు పంచుకోవడం, సమాజం కోసం ఏదైనా చేయాలన్న వారి తపన తెలుసుకోవడం తనకు చాలా ఇష్టమన్నారు.













