కాంగ్రెస్, గాంధీ కుటుంబం.. ఈ దేశానికి పట్టిన రాహు-కేతులు: అమిత్ షా
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ ప్రభుత్వం, గాంధీ కుటుంబంపై విమర్శల వర్షం కురిపించారు. రాజస్థాన్ ప్రజలు గెహ్లాట్ ప్రభుత్వాన్ని విస్మరించారని, ప్రభుత్వం ఇక్కడ విఫలమైందని చెప్పారు. డిసెంబరు 3న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని, బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్లో ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసిన అమిత్ షా.. ‘కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఈ దేశానికి పట్టిన రాహు,కేతువులు. దేశ భవిష్యత్తును నిర్మించడంలో ఇప్పుడు ఎదురవుతున్న అన్ని ససమ్యలను వీళ్లే సృష్టించారు’ అని మండిపడ్డారు.













