మోదీనే మూడోసారి ప్రధాని : అమిత్ షా
వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు మరోసారి ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దిబ్రూఘడ్లో జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే మూడోసారి బీజేపీ అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 300 పై చిలుకు స్థానాల్లో గెలుపు సాధిస్తుందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 14 లోక్సభ సీట్లలో 12 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని తీరుతుందన్నారు. 2024 లోక్భ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో గెలుస్తుంది. నరేంద్ర మోదీనే వరుసగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపతారంటూ అమిత్ షా పేర్కొన్నారు.













