కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హోళీ పండుగ సందర్భంగా ఉద్యోగులకు రూ.10 వేలు అడ్వాన్సుగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో హోళీ జరగనుంది. ఈ క్రమంలో హోళీని ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద అడ్వాన్సు తీసుకునేందుకు మార్చి 31వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది. అడ్వాన్సు తీసుకున్న ఉద్యోగులు నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. డబ్బు అవసరమున్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు కేంద్ర ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు ఊరట కలిగించే మరో నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న మూడు విడతల డీఏ, డీఆర్ ను జూలై నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది.













