డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం పూజలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఢిల్లీలో హిందూసేన ప్రత్యేక పూజలు నిర్వహించింది. తూర్పు ఢిల్లీలోని ఓ ఆలయంలో జరిపిన పూజల్లో హిందూసేన కార్యకర్తలు, ట్రంప్ మద్దతుదారులు పాల్గొన్నారు. 30 నిముషాలపాటు హోమం, పూజలు జరిపించారు. ఇస్లాం ర్యాడికల్స్‌కు వ్యతిరేకంగా ట్రంప్ సమర్థవంతంగా పనిచేశారని, ప్రపంచ దేశాలు ట్రంప్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పూజారి చెప్పుకొచ్చారు. గతంలోనూ ఇలాగే పూజలు చేశామని, ట్రంప్ గెలిచాడని హిందూసేన అధ్యక్షుడు విష్ణుగుప్తా వెల్లడించారు. ఈసారి కూడా తమ పూజలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.













