అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హిమంత

అస్సాంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీశ్ ముఖీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనాహల్, త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, నాగాలాండ్ సీఎం నీవ్యూ రియో తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మూడు విడుతల్లో ఎన్నికలు జరగ్గా.. బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 60, మిత్ర పక్షాలన అస్సాం గణపరిషత్‍కు 9, యూపీపీఎల్ ఆరు స్థానాల్లో గెలుపొందాయి. విజయం తర్వాత సర్బానంద సోనోవాల్, హిమంతలో ఎవ్వరినీ ముఖ్యమంత్రి పదవి ఎన్నుకోవాలో తేల్చుకోలేక బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు హిమంతను తదుపరి అసోం ముఖ్యమంత్రిగా ఎక్నుకుంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా రెండోసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానన్ని ఏర్పాటు చేసింది.