హిమాచల్ ప్రదేశ్‌లో సత్తా చాటిన కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 స్థానాలకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై మేజిక్ ఫిగర్ (35) ను దాటేసింది. ఇప్పటికే 36 స్థానాల్లో విజయం సాధించగా, మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 23 సీట్లు గెలిచి, 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు మూడు సీట్లను గెలిచారు. ఆప్ ఎలాంటి ప్రభావం చూపడం లేదు. బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించాలని యోచిస్తుంది కాంగ్రెస్. ఆ బాధ్యతను చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ బఘేల్, పార్టీ నేత భూపీందర్ సింగ్ హుదాలకు అప్పగిచింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సొంత రాష్ట్రం కావడంతో హిమచల్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారగా ఇక్కడ కాంగ్రెస్ విస్పష్ట ఆధిక్యంతో దూసుకెళ్లడంతో కమలనాధులను కలవరపపరుస్తోంది.













