బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్

అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది చట్టసభ సభ్యులకు గానూ 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. ఈ ఓటింగ్ జరుగుతోన్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్, 5 నెలల తర్వాత నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. ఇందులో అధికార కూటమిలోని జేఎంఎంకు 27, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస తీర్మానం నెగ్గాలంటే 42 మంది సభ్యుల మద్దతు పలకాల్సి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత మ్యాజిక్ మార్కు 38కి తగ్గింది. అయితే, జేఎంఎంకు పూర్తి మెజార్టీ ఉండటంతో ఈజీగా సోరెన్ విశ్వస పరీక్షలో నెగ్గేశారు.