రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. వారు కచ్చితంగా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో పాల్గొనే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అందరూ మాస్కూలు, శానిటైజర్లు ఉపయోగించాలని స్పష్టం చేశారు. కరోనా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే భారత్ జోడో యాత్రలో అనుమతించాలని కేంద్ర మంత్రి హితవు పలికారు. ఒకవేళ కరోనా నిబంధనలు పాటించడం సాధ్యం కాకపోతే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జోడో యాత్రను రాహుల్ తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్కు మాండవీయ లేఖ రాశారు. చైనా సహా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్లో కలవరం మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.













