భారత్, అమెరికా విదేశాంగ కార్యదర్శుల భేటీ

కరోనా వైరస్‍తో పోరాడేందుకు కొవిడ్ వ్యాక్సిన్‍ల సరఫరాతో పాటు సంబంధిత అంశాలపై విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్‌వర్ధన్ ష్రింగ్లా, అమెరికా దౌత్య వ్యవహారాల ప్రతినిధి డేనియల్ బి స్మిత్‍తో చర్చలు జరిపారు. రెండు దేశాల ప్రాంతీయ సమస్యలు, ఐక్యరాజ్య సమితి సహకారం వంటి అంశాలు ఉభయుల మధ్య సానుకూల సమావేశంలో చర్చకు వచ్చాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. భారత్‍తో పాటు అనేక ఇతర దేశాల కరోనా వ్యాక్సిన్ లభ్యతపై అమెరికా ప్రభుత్వ యంత్రాంగం సమాలోచనల గురించి ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రధాని మోదీకి ఫోన్‍లో వివరించిన నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోదీతో అమెరికా
ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ ఫోన్ సంభాషణ తర్వాత అమెరికా, భారత్‍లో ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన సరఫరాలను, వ్యాక్సిన్ తయారు చేసే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల వంటి వాటిని మరింత బలోపేతం చేసే దిశగా విదేశాంగశాఖ కార్మదర్శి హర్షవర్ధన్, అమెరికా తాత్కాలిక దౌత్యవేత్త డేనియల్ బి.స్మిత్‍ల మధ్య చర్చలు జరిగాయన్నారు.