రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీఠం ఎన్డీయేదే
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. జేడీయూకు చెందిన హరివంశ్ అభ్యర్థిత్వాన్ని జేపీ నడ్డా ప్రతిపాదించగా, థాపర్ చంద్ సమర్థించారు. యూపీఏ తరపున అభ్యర్థిగా పోటీచేసిన ఆర్జేడి నేత మనోజ్ ఝాపై ఆయన విజయం సాధించారు. తొలుత 2018లో కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్‌ను ఓడించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో పదవీకాలం ముగియడంతో మరోసారి పోటీలో నిలిచారు.
హరివంశ్ తిరిగి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల మొదటి నుంచి బీజేపీ ధీమాగా ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీయేకు 113 మంది సభ్యులు బలం ఉన్నప్పటికీ విపక్షాల మద్దతు కూడగట్టడంలో ఆ పార్టీ సఫలమైంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీయే అభ్యర్థికి వైకాపా మద్దతు ఇవ్వగా, టీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా నిలించింది.













