ఈ ఏడాది కూడా ..హజ్ యాత్ర రద్దు
కరోనా కారణంగా హజ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు భారత హజ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మక్సూద్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వులు వెల్లడించారు. కొవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో సౌదీ అరేబియా తమ దేశస్థులకు, అదీ పరిమిత సంఖ్యలో మాత్రమే హజ్ యాత్రకు అనుమతిస్తున్నది. బయటవారినెవరినీ అనుమతినివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మక్సూద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈసారి దేశం నుంచి హజ్‌యాత్రకు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్టు ఇండియన్ హజ్ కమిటీ ప్రకటించింది. గతేడాది కూడా హజ్ యాత్ర రద్దయ్యింది.













