జ్ఞానవాపి మసీదు పై …వారణాసి కోర్టు కీలక నిర్ణయం
వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు విచారణపై అక్కడి జిల్లా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్ను విచారణ కొనసాగింపునకు న్యాయస్థానం అంగీకరించింది. పిటిషన్ విచారణార్హం కాదని ప్రతివాదులు చేసిన వాదనను తోసిపుచ్చింది. వారణాసి జిల్లా కోర్టు నిర్ణయంతో ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్ విచారణ ముందుకు సాగనుంది. ఇదిలా ఉంటే, జ్ఞానవాపి కేసు విచారణలో భాగంగా సర్వే చేపట్టాలని న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గతంలోనే సర్వే పూర్తి చేసింది. ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి నివేదికను కోర్టుకు అందజేసింది. అనంతరం సర్వే నివేదికలోని అంశాలు బహిర్గతం కావడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది.













