ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువ జామునుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. షిర్డిలోని బాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. గురువు అంటే అజ్ఞానాన్ని పోగెట్టి జ్ఞానమిచ్చేవారు. తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు. కానీ మనిషిలోని మూఢత్వాన్ని తొలగించి, మానవ జన్మను సార్థకం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది గురువు మాత్రమే. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమతో శిష్యుడికి గురువు విద్యను బోధిస్తాడు. తన సర్వస్వం గురువుకే అంకితం చేస్తానంటాడు శిష్యుడు. ఇదీ గురుశిష్యుల సంబంధం. ఏ రకమైన పేగుబంధం లేని పరమాత్మ సంబంధం అది.













