గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు
ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటిచెబుతూ గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది. ప్రసిద్ధ మోధెరా దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సూర్య నమస్కారాలు చేశారు. 108 ప్రాంతాల్లో దాదాపు 4 వేలమందికి పైగా ఇందులో పాల్గొన్నారు. విద్యార్థులు, పలు కుటుంబాలు, యోగా ఔత్సాహికులు, వయో వృద్ధులు ఇందులో పాల్గొన్నారు. 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఫ్వీు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి హాజరై గుజరాత్ రికార్డ్ సాధించినట్లు ప్రకటించారు.













