మహిళా దినోత్సవం వేళ.. ఓ చరిత్రాత్మక నిర్ణయం
మహిళా దిన్సోతవం వేళ భారత వైమానిక దళం ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళలు నేరుగా యుద్ధ క్షేత్రంలో విధులు నిర్వర్తించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ మేరకు గ్రూప్ కెప్టెన్ షాలిజా దామికి పశ్చిమ సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్ కాంబూట్ యూనిట్లో కమాండ్ బాధ్యతలు అప్పగించింది. రణరంగంలో నాయకత్వ బాధ్యతను మహిళకు అప్పగించడం ఇదే తొలిసారి. ధామి 2003లో హెలికాప్టర్ ఫైలట్‌గా భారత వాయుసేనలోకి అడుగుపెట్టారు. ఆమెకు 2,800 గంటల హెలికాప్టర్ నడిపిన అనుభవం ఉంది. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా వ్యవహరించారు. వాయుసేవలో గ్రూప్ కెప్టెన్ అంటే ఆర్మీలో కల్నల్‌తో సమానం. ప్రస్తుతం ఆమె ఫ్రంట్‌లైన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి మెడికల్ విభాగం దాటి ఆర్మీ కూడా మహిళలకు కమాండింగ్ బాధ్యతలు అప్పగిస్తోంది.













