సీబీఎస్ఈ పరీక్షలపై … 2 రోజుల్లో నిర్ణయం

సీబీఎస్‍ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. గురువారం వరకు సమయం కోరారు. దేశంలో కరోనా రెండోదశ నేపథ్యంలో సీబీఎస్‍ఈ, సీఐఎస్‍సీఈ పరీక్షలను రద్దుచేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‍పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.