అందుకే 1550కి పైగా చట్టాలను రద్దు చేశాం : కేంద్రమంత్రి
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాలం చెల్లిన చట్టాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాతరేసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. ఇప్పటివరకు 1550కి పైగా చట్టాలను రద్దు చేసినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన ప్రాంతీయ పరిశ్రమల సదస్సు ముగింపు సెషన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ ప్రజలను, వ్యాపారులను ఇబ్బంది పెట్టే అనవసర చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఒకప్పుడు కార్మికులను వ్యాధుల నుంచి రక్షించేందుకు పారిశ్రామిక యానిట్లను వైట్‌వాష్ చేసే చట్టం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి చట్టాల వల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకే వాటిని రద్దు చేశాం అని తెలిపారు.













