ప్రియాంక గాంధీకి షాక్ ఇచ్చిన కేంద్రం ….
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్ 1లోగా ఖాళీ చేయాలని ఆమెను కోరింది. ప్రియాంక గాంధీ ఎస్పీజీ పరిధిలో లేనందు లోథీ రోడ్లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది. 35, లోడీ ఎస్టేట్స్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో సృష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే.













