నూతన సీడీఎస్ గా అనిల్ చౌహాన్
భారత త్రివిధ దళాల నూతన అధిపతి (సీడీఏస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను కేంద్రం నియమించింది. జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీ ఉన్న ఈ పోస్టుకు అనిల్ చౌహాన్‌ను ఎంపిక చేసినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన రక్షణశాఖ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శింగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది మేలో ఈస్టర్న్ కమాండర్‌గా పదవీ విరమణ చేసిన లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ చౌహాన్ 40 ఏండ్ల సర్వీసులో సైన్యంలో వివిధ హోదాల్లో పని చేశారు. 1961 మే 18న జన్మించిన ఆయన 1980లో ఆర్మీలో చేరారు. జమ్ముకశ్మీర్, ఈశన్య భారతదేశంలో తిరుగుబాటులను నిరోధించటంలో కీలకంగా పని చేశారు. పరమ్ విశిష్ట్ సేవా మెడల్,
ఉత్తమ్ యుద్ద్ సేవా మోడల్, అతి విశిష్ట్ సేవా మెడల్, విశిష్ట్ సేవా మోడల్ సహా పలు పురస్కారాలు అందుకొన్నారు. సీడీఎస్‌గా నియమితులైన రెండో వ్యక్తి ఈయనే.













