ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. దానిపై మేం వారికి గ్యారంటీ ఇచ్చాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరియాణలో పర్యటించారు. రేవాడీలోని ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రైతులకు మేలు చేసే పథకాలపై మా ప్రభుత్వం పని చేస్తోంది. గతంలో అన్నదాతలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కాదు. కానీ దానిపై మేం వారికి గ్యారంటీ ఇచ్చాం అని మోదీ తెలిపారు. రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఆందోళన మూడోరోజూ కొనసాగుతోంది. దీనిపై రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదు. తమ ఆందోళనను ఉధృతం చేస్తామని, తప్పకుడా ఢిల్లీ చేరుతామని రైతన్నలు చెబుతున్నారు. ప్రస్తుతం వీరంతా పంజాబ్, హరియాణా సరిహద్దులోనే ఉన్నారు. అటు దేశ రాజధాని సరిహద్దుల్లోనూ భారీగా బలగాలు మోహరించాయి.













