మన దేశం నుంచి పరదేశంలో ఉన్న మన వారి కోసం ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పార్సెల్ సర్వీస్..

మన దేశం నుంచి ఎందరో విద్యా, ఉపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వెళుతున్నారు. అటువంటి వారి కోసం ఇక్కడ నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులు తరచుగా తినుబండారాలు, బహుమతులు వంటివి పంపుతూ ఉంటారు. అయితే వీటికోసం ప్రైవేట్ తపాలా ఏజెన్సీలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులకు పరిష్కారంగా మన విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో విదేశీ తపాలా కార్యాలయం అతి తక్కువ ధరకి అద్భుతమైన సేవలను అందిస్తోంది. మనలో చాలామందికి ఈ విదేశీ తపాలా శాఖ సేవలపై పూర్తిస్థాయి అవగాహన లేదు. ప్రైవేటు సంస్థలతో పోల్చుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ తపాలా సర్వీస్ చాలా తక్కువ ధరకు వస్తువులను విదేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తుంది. విదేశాల్లో ఉన్న కస్టమర్లకు మీరు వస్తువులను భద్రంగా ఎలా చేరుస్తారు? ఎన్ని రోజుల్లో సరుకులు గమ్యస్థానానికి చేరుతాయి? వాటి భద్రత గురించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం..
రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఈ విదేశీ తపాలా కార్యాలయం ద్వారా సరుకులను పంపించవచ్చు. విజయవాడలో ఉన్న ప్రజలకైతే తపాలా శాఖ వారు ఇంటి వద్దకే వచ్చి పార్సిల్ చేయవలసిన వస్తువులను తీసుకువెళ్తారు. ఇంతకుముందు కష్టం క్లియరెన్స్ చెన్నైలో ఉండేది.. అయితే మీరు ఈ తపాలా సర్వీసు ద్వారా పంపించే సరుకులకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్ విజయవాడలోని విదేశీ కార్యాలయంలోనే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచే నేరుగా పార్సిల్ ని ఎటువంటి ఆలస్యం చేయకుండా విదేశాలకు పంపుతారు.
మెడిసిన్స్, డ్రగ్స్, ఆయిల్స్, అగరవత్తులు, వెపన్స్, బంగారం మరియు వెండి లాంటి కొన్ని నిషేధకరమైన వస్తువులను మాత్రం పంపడం కుదరదు. ఒకవేళ మీరు ఇచ్చిన సామాన్లలో అటువంటివి ఉంటే పక్కన పెట్టి.. తిరిగి పర్సనల్ గా యజమానులకు వాటిని హ్యాండ్ ఓవర్ చేస్తారు. గతంలో విజయవాడ నగరంలోని ఒక తాత్కాలిక భవనంలో ఈ కార్యాలయమును నడిపేవారు. ఇప్పుడు మంచి వసతులతో నిర్మించిన కొత్త భవనంలో ఈ ఆఫీసు తన సేవలను అందిస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ కాబట్టి భద్రతతో పాటు ఎకనామిక్ గా కూడా ఉంటుంది. కాబట్టి మీ ఇష్టమైన వారికి వస్తువులు విదేశాలకు పంపాలి అనుకునేవారు తప్పక ఈ సర్వీస్ ని ఉపయోగించుకోవచ్చు.