గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్

ప్రజలకు తమ ప్రాంతంలోని దవాఖానాల్లో పడకలు, ఆక్సిజన్ లభ్యత గురించి సమాచారాన్ని అడిగేందుకు, పంచుకునేందుకు టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు తమ మ్యాప్స్ లో జోడించేందుకు కొత్త ఫీచర్‍ను పరీక్షిస్తున్నది. అయితే ఇందులో కంటెంట్ యూజర్లు ఇచ్చేది ఉంటుందని, కాబట్టి ఆ సమాచారం తాజాదేనా, కచ్చితమైనదేనా పరిశీలించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 23 వేల టీకా కేంద్రాల సమాచారాన్ని యూజర్ల కోసం గూగుల్ పొందుపర్చింది.