వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు శుభవార్త!
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు శుభవార్త. కరోనా రాకతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కాగా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఎక్కువ సేపు పనిచేస్తున్నారనే వార్తలు రావడంతో వర్క్ ఫ్రమ్ హోంపై కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇంటి నుంచి పనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలను రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. దీంతో ఉద్యోగుల హక్కులను కాపాడే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఉద్యోగులను ఆయా సంస్థలు పిండేస్తున్నాయి. ఈ ఫ్రేమ్ వర్క్‌తో ఉద్యోగులకు కచ్చితమైన పనిగంటలను నిర్ణయించి అమలు చేయనున్నట్టు తెలుస్తోది.
అంతేకాకుండా ఉద్యోగులను విద్యుత్, ఇంటర్నెట్ బిల్లు, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్ స్పేస్, ఫర్నిచర్ వంటి ప్రాథమిక ఖర్చులను కంపెనీలు భరించేలా నిభంధనలను రూపొందించనున్నారు. వర్క్ ఫ్రమ్ హోంపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థను నిరయమించనుంది. కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోంపై స్టాండిరగ్ ఆర్డర్స్‌ను ఆమోదించడం ద్వారా పలు సేవారంగాల్లో వర్క్ ఫ్రమ్ హోంను లాంఛనప్రాయం చేసింది. ఈ ఆర్డర్స్‌తో రిమోట్‌గా పని చేయాలని నిర్ణయించుకునే ముందు ఉద్యోగులు, కంపెనీలు పరస్పరం పని గంటల సమయాన్ని, ఇతర షరతులను సెట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అయితే వాస్తవికంగా పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఉద్యోగులను ఎక్కువ సమయం మేర పని చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకుగానూ ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకుగాను ఇటీవల పోర్చుగల్ వర్క్ ఫ్రమ్ హోం చట్టాలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ చట్టాలను ఆమోదం లభిస్తే వర్క ఫ్రమ్ హోం ఉద్యోగులకు చట్టపరమైన మద్దతును అందించడంతో పాటుగా కంపెనీలకు మరింత జవాబుదారీతనాన్ని జోడిస్తుంది.













