ఇది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు : ఆజాద్
ఉమ్మడి పౌరస్మృతి అంశంపై చర్చ జరుగుతున్న వేళ కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్ స్పందించారు. దీని అమలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రానికి సూచించారు. ఇది అన్ని మతాలకు సంబంధించిన సున్నితమైన అంశం అని, కాబట్టి ఆర్టికల్ 370 రద్దు చేసినంత సులువుగా యూసీసీ అమలు సాధ్యం కాదన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినంత సులువుగా ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో అమలు చేయడం సాధ్యం కాదు. కేవలం ముస్లింలే కాదు క్రిస్టియన్లు, సిక్కులు, గిరిజనులు, జైనులు, పార్సీలు ఇలా పలువురితో ముడిపడిన అంశం. కాబటి ్ట ఇది ( ఉమ్మడి పౌరస్మృతి అమలు ) ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి ముందడుగూ వేయకపోవడమే మంచిదని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. భూమి లేని వారికి భూమి ఇవ్వనున్నట్లు జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ప్రకటనను ఆజాద్ స్వాగతించారు. కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో ఉన్న వ్యక్తులకే భూములు ఇవ్వాలని, స్థానికేతరులకు కాదని సూచించారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. అధికారులతో ఆరు నెలలకు మించి పాలించలేరన్నారు. కాబట్టి వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.













