కాంగ్రెస్ పార్టీకి గులాంనబీ ఆజాద్ గుడ్ బై
సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఆజాద్, పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల లేఖను ఆయన రాశారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వైఎస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైనట్లు ఆయన తెలిపారు. ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి భారీ జలక్ తగిలినట్లు అయ్యింది. ఏఐసీసీ కోటరీలో పట్టుదల, సత్తా లోపించిందన్నారు. ఈ నేపథ్యంలో చాలా బాధాకర రీతిలో 50 ఏళ్లు సేవ చేసిన పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆజాద్ తన లేఖలో తెలిపారు.













