సక్సెస్ ఫుల్ నేతగా మార్చాలనుకున్నాం… కానీ ఆయనకు
30 ఏళ్ల క్రితం సోనియా గాంధీకి ఎలాంటి గౌరవం ఇచ్చామో ఇప్పుడూ అంతే మర్యాద ఉందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆజాద్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీకి కూడా గౌరవం ఇస్తున్నట్లు తెలిపారు. ఇందిరా గాంధీ ఫ్యామిలీ, రాజీవ్-సోనియా కుమారుడి పట్ల నతకు ద్వేష భావం లేదన్నారు. వ్యక్తిగతంగా రాహుల్ సుదీర్ఘ జీవితం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీని సక్సెస్ ఫుల్ నేతగా మార్చేందుకు ప్రయత్నించామని, కానీ ఆయనకు ఎటువంటి ఆసక్తి లేదని అన్నారు.
జీ23 లేఖ ఇవ్వడానికి ఆరు రోజుల ముందు, ఆ తర్వాత తనకు నిద్రపట్టలేదన్నారు. పార్టీ కోసం రక్తాన్ని ధారపోశామన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు వ్యర్థులని, తమకు గురించి తెలియని వ్యక్తి పార్టీ ప్రతినిధిగా ఉండడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ క్రూరంగా ఉంటాడని అనుకున్నా, కానీ ఆయన మానవత్వాన్ని చాటారని అన్నారు.













