రాజకీయాలకు గులాం నబీ ఆజాద్ గుడ్ బై ?
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఆజాద్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌కు చెందిన ఒక సంస్థ ఆయనను సన్మానించింది. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాల దిశగా అడుగులు వేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలే ఆ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందు కోసం తాను రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవలసిన పని లేదని ఆజాద్ అన్నారు. ప్రస్తుతం తనలో ఆదే ఆలోచన ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తరువాత ఆజాద్ త్వరలోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతారన్న ప్రచారం జోరు అందుకుంది.













